ఇంద్ర హీరోగా తనీషా హీరోయిన్‌గా నటిస్తోన్న ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ చిత్రం "పుత్రుడు". ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయిందని దర్శకుడు శ్రావణ్ బాపట్ల తెలిపారు. సోమవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతనెల 18వ తేదీన ఈ సినిమా షూటింగ్ ప్రారంభించామన్నారు. ఇప్పటికే జీవా, రాజేందర్, కవిత, జయవాణి, కొండవలస, నల్లశ్రీను తదితర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించామన్నారు.
ప్రభాకర్ అద్భుతమైన కెమేరా పనితనం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. పరశువేది బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని, హీరో ఇంద్ర ఇందులో మెడికల్ కాలేజీ స్టూడెంట్‌గా నటిస్తున్నాడని బాపట్ల వివరించారు. ఇందులో ఇంద్ర రెండు కోణాల్లో కన్పిస్తాడని ఆయన చెప్పారు.
ఇంకా ఈ సినిమాలో ఐదు పాటలున్నాయని, అందులో ఓ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారని తెలిపారు. రెండో షెడ్యూల్‌ను ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని బాపట్ల వెల్లడించారు.
ఇంద్ర మాట్లాడుతూ.. దర్శకుడు తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే విధంగా తీర్చిదిద్దుతున్నారని, మార్షల్ ఆర్ట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు.
ఇంకా ఈ చిత్రానికి కెమేరా: షమ్ము వి. ప్రభాకర్, సంగీతం: సత్య, వై., ఫైట్స్: లంకా సాంబశివరావు, ఎడిటర్: డి. రాజా, నిర్మాత: బొద్ద ఇంద్రసేన, సహనిర్మాత: బుక్క వేణుగోపాల్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రావణ్ బాపట్ల.