Evarina Epudaina| AVM| Varun Sandesh| Vimala raman | "ఎవరైనా ఎప్పుడైనా" ఆడియో విడుదల
|
వరుణ్ సందేశ్, విమలారామన్ జంటగా నటిస్తోన్న చిత్రానికి మార్తాండ్ శంకర్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను ఎం. శరవణన్, ఎం.ఎస్. గుహన్, అప్ణ గుహన్‌లు నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి హైదరాబాదులో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హీరోలు ప్రభాస్, గోపించంద్‌లు సీడీని ఆవిష్కరించి డి. సురేష్ బాబుకు అందించారు. ఆడియో క్యాసెట్‌ను దిల్‌రాజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా టైటిల్ నేపథ్యానికి తగినట్లుగా అతిథులను తమ జీవితంలో ఎప్పుడైనా ప్రేమలో పడిన సందర్భాన్ని చెప్పమని యాంకర్ కోరగా పలువురు స్పందించారు.
డా. డి. రామానాయుడు మాట్లాడుతూ.. తాను "ప్రేమ" అనే సినిమా తీశారన్నారు. ఈ చిత్రం ద్వారా తన కుమారుడికి ఉత్తమనటుడి అవార్డు, దర్శకునితో పాటు తనకు కూడా ఉత్తమ నిర్మాత అవార్డు వచ్చిందన్నారు. ఇదే తరహాలో ఎవరైనా ఎప్పుడైనా చిత్రం హిట్ కావాలని రామానాయుడు ఆశించారు.
ప్రేమ అనేది లేకపోతే ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలేదని రమేష్‌ప్రసాద్ పేర్కొన్నారు. ప్రేమ అనే రెండు పదాల్ని తెలుగు అనే చక్కని మూడక్షరాలతో చెప్పేది కాదని, ఈ సినిమాలో మణిశర్మ సంగీతం బాగుందని ఆయన కొనియాడారు.
తాను ఇంకా ప్రేమ చిత్రాల్లో నటించలేదని, నటించాక ప్రేమ గురించి చెబుతానని గోపీచంద్ అన్నారు. అందరూ అనుభవించే ప్రేమను తెలియజెప్పడం చాలా కష్టమని ఉదయ్‌కిరణ్ తెలిపారు. దిల్‌రాజు మాట్లాడుతూ.. ఈ సినిమాను చూశానని, వరుణ్‌సందేశ్‌కు ఈ చిత్రం హ్యాట్రిక్ ఇస్తుందని చెప్పారు.
మణిశర్మ వద్దకు వెళ్ళినపుడు... కొత్తవారిని ఎలా రిసీవ్‌చేసుకుంటారోనని చాలా భయపడుతూ వెళ్లాను. కానీ ఆయన రిసీవ్ చేసుకున్న విధానం ఎంతగానో నచ్చిందని చిత్ర దర్శకుడు శంకర్ అన్నారు. సినిమాలో కూడా చాలా సలహాలు ఇచ్చి ప్రోత్సహించారని, గీతరచయితలు చాలా చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారని శంకర్ తెలిపారు.
నిర్మాత శరవణన్ మాట్లాడుతూ.. మూడు తరాలవాళ్లం చిత్ర కథ విని అంగీకరించామని, మంచి సక్సెస్ సాధిస్తుందని ఆకాంక్షించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభాస్, నవదీప్, నిఖిల్, జెమినీ కిరణ్, జయంతీ పర్జాన్జీ తదితరులు పాల్గొన్నారు.