1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Aarthi

Jayam Ravi| Aarthi| Mariage| Editor Mohan | ఆర్తీని పెళ్లాడనున్న "జయం" రవి

జయం రవి
నితిన్, సదా హీరోహీరోయిన్లుగా నటించిన "జయం" చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే పేరుతో తమిళంలో విజయం సాధించిన "జయం" చిత్రంలో హీరోగా నటించిన "రవి" ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ ఎడిటర్ మోహన్ కుమారుడైన జయం "రవి"కి, ఆర్తీ అనే అమ్మాయితో గురువారం కళ్యాణం వైభోగంగా జరుగబోతుంది.

ఈ విషయమై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి తండ్రి ఎడిటర్ మోహన్ మాట్లాడుతూ.. బొమ్మరిల్లు (తమిళంలో సంతోష్ సుబ్రహ్మణ్యం), నువ్వొస్తానంటే నేనొద్దంటానా (తమిళంలో సమ్‌థింగ్ సమ్‌థింగ్), అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి (ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి) వంటి టాలీవుడ్ హిట్ చిత్రాలను, కోలీవుడ్ తెరకెక్కించిన హీరో రవి వివాహం ఈ నెల నాలుగో తేదీ (గురువారం) ఘనంగా జరుగనుందన్నారు. జూన్ ఏడో తేదీ రవి-ఆర్తీల రిసెప్షన్ చెన్నైలోని మేయర్ రామనాథన్ సెంటర్లో జరుగనుందని మోహన్ చెప్పారు.

తన పెళ్లి విషయమై రవి మీడియాతో మాట్లాడుతూ.. జయం చిత్రం ద్వారా తెరకు పరిచయమైన తనను ప్రేక్షకులు ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

హీరోగా నిలదొక్కుకునేందుకు తనకు అన్ని విధాలా సహకరించిన తన తండ్రి, సోదరుడు ఎం.రాజా, మీడియా, అభిమానులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. త్వరలో ఓ ఇంటివాడిని కాబోతున్న తనకు అందరి ఆశీస్సులు కావాలని చెప్పారు.

ఆర్తీ గురించి చెబుతూ.. ఆర్తీ తనకు భార్యగా దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని రవి చెప్పారు. తనకు అన్నివిధాలా ఆర్తీ సరిపోతుందని రవి వెల్లడించారు.

తమది ప్రేమ వివాహమేనని, అయినప్పటికీ తన కుటుంబీకులు ఈ పెళ్లికి సమ్మతించడం ఆనందంగా ఉందన్నారు. తమిళ దర్శకుడు విజయ్‌కుమార్-సుజాత కుమార్తె అయిన ఆర్తీని తాను ప్రేమించానని రవి తెలిపారు,

ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి వారి అనుమతితో తన వివాహం జరుగుతుందన్నారు. ఇంకేముంది..? వీరి ప్రేమ వివాహం మూడు పువ్వులు ఆరు కాయలుగా చిరకాలం వర్ధిల్లాలని మనమూ ఆశిద్దాం..!
About Writer
SELVI.M