Ravitheja| Bellamkonda| Ramesh| Vamsi krishna | రవితేజ తాజా చిత్రం ప్రారంభం
|
బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ పద్మావతి సమర్పిస్తున్న ఈ సినిమాకు ఉప్పలపాటి రవి సహ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు.
రవితేజ చిత్రాల తరహాలో ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని బెల్లంకొండ సురేష్ తెలిపారు. జూలై మొదటివారంలో షూటింగ్ ప్రారంభిస్తామని సురేష్ వెల్లడించారు.