1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Tanish

Mouna ragam| Tanish| Nachavle| Ride | "మౌనరాగం" షూటింగ్ ప్రారంభం

మౌనరాగం షూటింగ్
WD
సాయిదేవ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బెల్లంకొండ నిర్మిస్తోన్న తాజా చిత్రం "మౌనరాగం". రామానాయుడు స్టూడియోలో గురువారం ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.

రాజకీయనాయకుడు వసంత్ కుమార్ దేవుని పటాలపై తొలి షాట్‌కు క్లాప్ ఇవ్వగా, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కెమేరా స్విచ్ఛాన్ చేశారు. ఈ చిత్రం ద్వారా విజయబాలాజీ దర్శకుడిగా పరిచయమం అవుతున్నారు.

ఈ సందర్భంగా మాటల రచయిత చింతపల్లి రమణ మాట్లాడుతూ. చక్కని కుటుంబకథా చిత్రంగా మౌనరాగం రూపొందుతుందన్నారు. నచ్చావులే ఫేమ్ తనీష్ ఇందులో హీరోగా నటిస్తున్నాడని చెప్పారు.

ఈనాటి తరానికి కూడా నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయని చింతపల్లి తెలిపారు. సంగీతం పరంగా సినిమా హిట్ అవుతుందని వెల్లడించారు.

సంగీత దర్శకుడు ఎస్.ఎ. రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ ఏడాది మ్యూజికల్ హిట్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మంచి కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఆరు పాటలున్నాయని, ఇంకా రికార్డింగ్ పూర్తికాలేదని చెప్పారు. త్వరలో రికార్డింగ్‌ను పూర్తి చేస్తామని తెలిపారు.

నిర్మాతలు శానం నాగ అశోక్‌కుమార్, ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ.. వచ్చేవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి, జూలై, సెప్టెంబర్‌లలో సాగే షెడ్యూల్తో సినిమాను పూర్తి చేస్తామని చెప్పారు.

తనీష్ మాట్లాడుతూ.. నచ్చావులే, రైడ్ చిత్రాల కథకంటే వైవిధ్యమైన కథాశంతో మౌనరాగం రూపొందుతోందని అన్నారు. హీరోయిన్‌‌ ఇంకా ఎంపిక కానున్న ఈ చిత్రంలో అలీ, ధర్మవరపు, ఎం.ఎస్. నారాయణ, రాజశ్రీ తదితరులు నటించనున్నారు. కెమేరా.. షమన్ మిత్రు.
About Writer
SELVI.M