1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. "మర్యాద రామన్న"గా వస్తోన్న సునీల్

Maryada ramanna, Sunil, NTR, Ram charan, Prabhas, Raviteja | "మర్యాద రామన్న"గా వస్తోన్న సునీల్

మర్యాద రామన్న
WD
ఆర్కా మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్న "మర్యాద రామన్న" సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరిగింది.

ఈ కార్యక్రమానికి అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్, రవితేజలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సినిమా తొలిషాట్‌కు డి.సురేష్ బాబు క్లాప్ కొట్టగా, తమ్మారెడ్డి భరద్వాజ స్విచ్ఛాన్ చేశారు. కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా మర్యాద రామన్న చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న రాజమౌళి మాట్లాడుతూ.. స్టూడెంట్ నెం.1 నుంచి ఆర్.కె. మీడియాతో తనకు పరిచయముందన్నారు. అప్పుడే ఈ పతాకంపై కొత్త సినిమా ప్రారంభించాల్సిందని, కానీ అప్పుడు సాధ్యపడలేదని చెప్పారు.

థ్రిల్లర్ కామెడీ నేపథ్యంలో మర్యాద రామన్న తెరకెక్కనున్నాడని, వర ముళ్ళపూడి తనకు రాసుకున్న కథను తనకిచ్చారని రాజమౌళి తెలిపారు. ఇందులో హాస్యనటుడు సునీల్ పాత్ర సీరియస్‌గా ఉంటుందని, కానీ నవ్వుపుట్టిస్తుందని దర్శకుడు వివరించారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుందని ఆయన తెలిపారు.

తాను కథలోని పాత్రకోసమే దాదాపు పది కేజీలు తగ్గానని సునీల్ అన్నారు. ఈ నెలలో నాలుగు రోజుల పాటు షూటింగ్ జరిపి, ఆ తర్వాత జూలై, ఆగస్టులో జరిగే షెడ్యూల్తో చిత్రాన్ని పూర్తి చేస్తామని చిత్ర నిర్మాతలు వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రానికి సంగీతం.. ఎం.ఎం. కీరవాణి, కెమెరా.. ఛోటా కె నాయుడు, కథ, ఎస్.ఎస్. కాంచి, ఆర్ట్.. రవీందర్, ఎడిటర్.. కోటగిరి వెంకటేశ్వరరావు.
About Writer
SELVI.M