1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Jagapathy babu

Ma nanna Chiranjeevi| Jagapathy babu| Nilima | శరవేగంగా "మా నాన్న చిరంజీవి" షూటింగ్

మా నాన్న చిరంజీవి
WD
జగపతిబాబు, నీలిమ హీరోహీరోయిన్లుగా అరుణ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న "మా నాన్న చిరంజీవి (పేద్ద హీరో)" చిత్రం షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది.

జయశ్రీ సమర్పణలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని దర్శకుడు చెప్పారు. రామానాయుడు స్టూడియోలోని రోడ్లపై జగపతిబాబు, అతులిత్‌లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని ఆయన అన్నారు.

ఇందులో డిక్షనరీలు అమ్మే వ్యక్తిగా జగపతిబాబు నటిస్తున్నాడని, అవి ఎందుకు అమ్మాల్సి వచ్చింది అనేది ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. నీలిమ పాత్రకు సింపతీ వస్తుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని అరుణ్ ప్రసాద్ తెలిపారు.

నీలిమ మాట్లాడుతూ.. తెలుగులో హీరోయిన్‌గా ఇదే మొదటి చిత్రమన్నారు. జగపతిబాబుతో నటించడం చాలా ఆనందంగా ఉందని, గతంలో ఆమని చేసినటువంటి పాత్రను పోషిస్తున్నానని చెప్పారు.

తెలంగాణ శకుంతల, ఎం.ఎస్. నారాయణ, జయప్రకాష్ రెడ్డి, భువనేశ్వరి, సత్యం రాజేష్, శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: భరణి కె. ధరణి, ఎడిటింగ్: పైడిరెడ్డి, నిర్మాణం: లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్.
About Writer
SELVI.M