Najarana, Shooting,Y. Sailaja, Y.Koti babu | "నజరానా" షూటింగ్ ప్రారంభం
|
ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలిషాట్‌కు తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ కొట్టగా, సీనియర్ పాత్రికేయుడు భగీరథ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సి. కళ్యాణ్, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోటిబాబు మాట్లాడుతూ.. రెండు బద్ధ శత్రువులైన దేశాల్లో ఉన్న పిల్లల మధ్య స్నేహం ఏవిధంగా పరిమళించింది. దాని పర్యవసానాలేంటి అన్నదే కథాంశమన్నారు. సింగిల్ షెడ్యూల్‌తో ఈ చిత్రాన్ని ఏకధాటిగా చిత్రీకరించి తెరకెక్కిస్తామని కోటిబాబు తెలిపారు.