Sumanth| Boni| Distributors| Suresh babu | బోణీ డిస్ట్రిబ్యూటర్లపై దాడి: సమితి అభ్యంతరం
సుమంత్ హీరోగా, సరస్వతి ఫిలింస్ వారి "బోణీ" చిత్ర డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులపై జరిగిన దాడిపై తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బోణీ డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులపై, సురేష్ మూవీస్ వారు దాడిచేయడం సరికాదని మండిపడింది.
బోణీ డిస్ట్రిబ్యూటర్లయిన ఫణికిషోర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలను సునీల్ నారాయణ, జగదీష్ అనే వ్యక్తులు తమ థియేటర్లలో సినిమాను ఆడించకుండా ఇతర థియేటర్లలో ఎందుకు ఆడిస్తారని దాడి చేశారు. దీనిపై బోణీ డిస్ట్రిబ్యూటర్లు ఆర్.పి. రోడ్‌లోని మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సదరు ఎస్.ఐ.కూడా కేసు రాయలేదని చలనచిత్ర పరిరక్షణ సమితి కార్యదర్శి నట్టికుమార్ ఆరోపించారు.
ఈ విషయమై శనివారం ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నట్టికుమార్ ఇంకా మాట్లాడుతూ.. చిన్న నిర్మాతల్ని, డిస్ట్రిబ్యూటర్లను.. థియేటర్లను కబ్జాచేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు అనుచరులు పలురకాలుగా దాడి చేస్తున్నారని చెప్పారు. అందుచేత వారిని ఇండస్ట్రీ నుంచి వెలివేయాలని నట్టికుమార్ ఈ సందర్భంగా కోరారు.
ఈ విషయాన్ని కోర్టుదాకా తీసుకువెళతామని చెప్పారు. ఇంకా ఈ విషయాన్ని దాసరి నారాయణరావు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరుతామని నట్టికుమార్ అన్నారు.