Rahman| doctorate| Slumdog Millionaire| Aligarh Versity | రెహ్మాన్‌కు అలీగఢ్ వర్శిటీ డాక్టరేట్ పురస్కారం
"స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రానికి సంగీతం సమకూర్చి రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సంగీత సముద్రం ఎ.ఆర్. రెహ్మాన్‌కు గౌరవ డాక్టరేట్ లభించింది. చారిత్రాత్మిక అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ 59వ స్నాతకోత్సవం సందర్భంగా భారతీయలు గౌరవించదగ్గ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహ్మాన్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
దీంతో ఈ విశ్వవిద్యాలయం నుంచి ఈ గౌరవం పొందిన మాజీ రాష్ట్రపతులు జాకీర్ హుస్సేన్, డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం, స్వాతంత్ర్య సమరయోధులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌ల వంటి ప్రముఖుల సరసన రెహ్మాన్ కూడా చేరారు. రెహ్మాన్‌తో పాటు ప్రముఖ ఉర్దూకవి గోపిచంద్ నారంగ్‌ను కూడా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ.. మనదేశంలో అత్యధికమంది యువకులు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు కావాలని కోరుకుంటున్నారని, కానీ సృజనాత్మక రంగాలైన మీడియా, కళల్లోకి మరింత మంది రావాల్సిన అవసరముందని పిలుపు నిచ్చారు. భారతీయ విలువలతోనే జాతీయంగా 2009 ఆస్కార్, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డులతో అంతర్జాతీయంగా విజయం సాధించానని ఉద్ఘాటించారు.