Vogue| Depika Padukune| Bollywood | "వోగ్" కవర్‌పేజీపై దీపికా పడుకునే బొమ్మ
|
సహజంగా మోడల్ అయిన పడుకునే "ఓం శాంతి ఓం" చిత్రం ద్వారా బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా ప్రచారం కోసం గత నెలలో పెరూ రాజధాని లిమాలో దీపికా పర్యటించింది.
ఈ సందర్భంగా.. వోగ్, కోసాస్ మేగజైన్ పత్రికల కోసం దీపికా పడుకునే ఫోటోలకు కూడా దిగింది. పెరూ పర్యటన సమయంలో ఆ ప్రాంత ప్రజలు తనపై చూపిన అభిమానం ఏనాటికి మరువలేనిదని దీపికా వెల్లడించింది. మంత్రి మొదలుకొని చిల్లరకొట్టు వ్యాపారి వరకు అందరూ తనను ఎంతగానో మెచ్చుకున్నారని పడుకునే తెలిపింది.
ఇదిలా ఉంటే..ముంబైలో జరిగిన లాక్‌మీ ఫ్యాషన్ వీక్-2009లో అంతర్జాతీయ మోడల్ నవోమి కాంప్‌బెల్‌తో కలిసి ర్యాంప్ షోలో పాల్గొంది. అంతేగాకుండా, పెరూవియన్ మోడల్ ఫ్యాషన్ వీక్‌కు కూడా పడుకునే గౌరవ అతిథిగా హాజరైంది.