Sidharth, Shamili, oay, D.V.V. Danayya | 12 నుంచి చెన్నైలో "ఓయ్" చిత్రీకరణ
|
ఈ చిత్రం కోసం రెండు పాటలను ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. మే 25 నుంచి జూన్ 2వరకు ఆ పాటల చిత్రీకరణ రాజు సుందరం నృత్య సారథ్యంలో జరిగినట్లు దానయ్య పేర్కొన్నారు.
ఈ చిత్రానికి మరో పాట మిగిలి ఉందని, ఆ పాటను ఈ నెల 12 నుంచి చెన్నైలో చిత్రీకరించదలచినట్లు నిర్మాత అన్నారు. ప్రస్తుతం రీరికార్డింగ్ ముగింపు దశలో ఉందని, ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ అయిందని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.