1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. కరిష్మా కొటాక్ ప్రధాన పాత్రలో "గ్లామర్"

Karishma kotak, Glamour, Sankar Dada zindabad | కరిష్మా కొటాక్ ప్రధాన పాత్రలో "గ్లామర్"

కరిష్మా కొటాక్
"శంకర్‌దాదా జిందాబాద్" ఫేమ్ సెక్సీతార కరిష్మా కొటాక్ ప్రధాన పాత్రలో "గ్లామర్" అనే చిత్రం తెరపైకి రాబోతోంది. సర్దార్ చిన్నపరెడ్డి, ప్రత్యూష వంటి చిత్రాలను నిర్మించిన పి. సత్యారెడ్డి నిర్మాణ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గ్లామర్ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టే యువతీ యువకులకు ఎదురయ్యే సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత అన్నారు. ఈ నెల రెండో వారంలో అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభించనున్నామని సత్యారెడ్డి తెలిపారు.

ఆరు పాటలున్న ఈ చిత్రానికి కెమెరా.. శ్రీనివాస్, సంగీతం.. బొంబాయి రవి, సహ నిర్మాతలు.. రవీందర్, కామాక్షి బ్రదర్స్.
About Writer
SELVI.M