1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Rajasekhar

Asthma| Rajasekhar| Unani| Ayurveda| Fish medicine | ఉబ్బసం వ్యాధిని అరగంటలో నయం చేస్తా..!

ఉబ్బసం వ్యాధి
WD
ఉబ్బసం వ్యాధికోసం బత్తిన సోదరులు గత కొన్నేళ్ళుగా వేస్తున్న చేపమందుపై నటుడు డాక్టర్ రాజశేఖర్ స్పందించారు. వైద్య శాస్త్రంలో చేప మందువల్ల తగ్గిపోయే జబ్బు ఏదీ లేదని ఆయన అన్నారు. చేపమందుపై పేపర్లో రకరకాలుగా వస్తున్న వార్తల పట్ల రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉబ్బసం వ్యాధి కోసం మూడేళ్ళుగా మందులు మింగడం అనే విషయాన్ని చదివి ఆశ్చర్యపోయానని, జన్యుపరంగా ఉన్న లోపం కారణంగా కొంతమందికి ఈ వ్యాధి వస్తుందని చెప్పారు.

దీనికోసం మూడేళ్ళుగా చేపమందును వాడటం విడ్డూరంగా ఉందని, తన దగ్గరకు వస్తే అరగంటలో నయం చేసి చూపిస్తానని రాజశేఖర్ అన్నారు. సోమవారం చేప మందు పంపిణీ చేస్తున్న ప్రాంతాన్ని రాజశేఖర్ సందర్శించి, చేపమందు వల్ల నయం పొందారా? లేదా? అనే వివరాలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బత్తిన సోదరులను రాజశేఖర్ ఏమాత్రం విమర్శించలేదు. కానీ పూర్వికులు ఏదో రహస్యాన్ని వారి వంశీయులకు చెప్పి ఉంటారని, ఆయుర్వేదం, యునాని తదితర వైద్యశాస్త్రంలో ఉబ్బసానికి తగిన పరిష్కారం ఉందని పేర్కొన్నారు. తాను కూడా పేదవారికి తగిన వైద్యసాయం చేయడానికి రంగం సిద్ధం చేశానని, త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తానని రాజశేఖర్ తెలిపారు.
About Writer
SELVI.M