1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Gulf

Magadheera| Gulf| Tollywood| Kajal agarwal | గల్ఫ్‌లో "మగధీర" షూటింగ్

రామ్చరణ్ తేజ
గీతా ఆర్ట్స్ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ హీరోగా నటిస్తున్న "మగధీర" చిత్రం షూటింగ్ గల్ఫ్‌లో జరుగనుంది. చందమామ ఫేమ్ సెక్సీడాళ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.

జూలైలో విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ఇకపోతే.. రొమాంటిక్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న "మగధీర" చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

శ్రీహరి కీలక పాత్ర పోషిస్తున్న ఈ లవ్లీ ఎంటర్‌టైనర్ "మగధీర" సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానుందని తెలిసింది. గల్ఫ్, కువైత్‌లలోని అద్భుత లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకోనున్న "మగధీర"పై టాలీవుడ్ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
About Writer
SELVI.M