1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Prabhas

Ek Niranjan| Prabhas| Kangana| Puri Jaganath | భారీసెట్‌లో "ఏక్ నిరంజన్" షూటింగ్

ఏక్ నిరంజన్
WD
ప్రభాస్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆదిత్యరామ్‌ నిర్మిస్తున్న "ఏక్ నిరంజన్‌' షూటింగ్‌ ఏకధాటిగా జరుగుతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ "ఫ్యాషన్" భామ కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రం గురించి పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్‌తో 50 శాతం సినిమా పూర్తయ్యిందన్నారు.

నిర్మాత మాట్లాడుతూ, ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం. 25లో ఎనిమిది ఎకరాల విస్తీర్ణమైన ప్రదేశంలో భారీ సెట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కళాదర్శకుడు చిన్నా ఈ సెట్‌ని అద్భుతంగా రూపొందించారని చెప్పారు.

"క్లాక్‌టవర్‌తో 4 రోడ్ల కూడలి, హనుమాన్‌ టెంపుల్‌, దోబీఘాట్‌, హీరోహీరోయిన్ల ఇళ్ళు, కొన్ని వీధులు.." ఇలా ఓ పెద్ద ఏరియాని క్రియేట్‌ చేసి చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల్ని ఈ సెట్‌లో చిత్రీకరించామని నిర్మాత వివరించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించిన 4 భారీ సెట్స్‌లో ప్రభాస్‌, కంగనా రనౌత్‌లపై ఓ పాటను షూట్ చేశామని చెప్పారు.

ఈనెల 18 నుండి నెలాఖరువరకు స్విట్లర్లాండ్‌లో రెండు పాటల్ని చిత్రీకరిస్తామని నిర్మాత వెల్లడించారు. జూలైలో 30 రోజులపాటు బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్‌ చిత్రీకరణకు రంగం సిద్ధం చేశామని చెప్పారు.

సోనూసూద్‌, ముకుల్‌దేవ్‌, మకరన్‌, దేశ్‌పాండే, బ్రహ్మానందం, అలీ, సునీల్‌, వేణుమాధవ్‌, బ్రహ్మాజీ, సంగీత, పోసాని కృష్ణమురళి, శ్రావణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: మణిశర్మ, సమర్పణ: పూరీ జగన్నాథ్‌.
About Writer
SELVI.M