Aamir Khan | Cry | Roger Federer | French open | Bollywood | superstar | ఫెదరర్‌లా నేనూ తెగ ఏడుస్తాను: అమీర్ ఖాన్
|
ఓడిన వారు కదా కన్నీళ్లు పెట్టుకోవాలీ.. అనే సందేహం మీకు రావచ్చు. కానీ ఫెదరర్ మాత్రం విజయం సాధించినప్పుడల్లా తెగ ఏడుస్తాడట. ఇదే అలవాటు మన బాలీవుడ్ గజినీ హీరో అమీర్ ఖాన్‌కూ ఉందట.
తన చిత్రం ఏది సక్సెస్ సాధించినా కళ్లంట నీళ్లు వాటికవే వచ్చేస్తాయట. మొన్నామధ్య ముంబయిలో గజినీ చిత్రం చూస్తున్నప్పుడు హాల్లోనుంచి బయటకు వచ్చినవాళ్లంతా గజినీ "సూపర్" అని పెద్దగా అరవడాన్ని విని హాల్లోని వీఐపీ గదిలోకి వెళ్లి తనివితీరా ఏడ్చి వచ్చాడట అమీర్. ఈ ఏడుపు విజయం సాధించినప్పుడల్లా వస్తుందని చెపుతున్నాడీ బాలీవుడ్ హీరో.