Balakrishna| Birth Day| Bellam konda Suresh | మళ్లీ ఒకటైన "బాలయ్య-బెల్లంకొండ"
సరిగ్గా నాలుగేళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును అభిమానులు వేడుక జరుపుకున్నారు. ఆ సమయంలో "చెన్నకేశవరెడ్డి" విడుదల సందర్భంగా ఏర్పాటైన బాలయ్య పుట్టిన రోజు వేడుకల్లో చిన్న పాటి వివాదం కాల్పులకు దారితీసింది.
ఈ ఉదంతం ద్వారా బాలకృష్ణ జ్యోతిష్కుడు సత్యనారాయణ కేర్ ఆసుపత్రిలో చేరడం, బెల్లంకొండ సురేష్ కూడా అపోలోలో చేరడం వంటివి జరిగాయి. ఆ తర్వాత బెల్లంకొండ-బాలయ్యలు కాంప్రమైజ్ కావడం, కాల్పులు తనపై జరపలేదని, ఎవరో అభిమానులను బెదిరించడానికి అలా చేశారని బెల్లకొండ వివరణ ఇచ్చారు.
తాజాగా బాలయ్య 50వ పుట్టినరోజు వేడుకకు బెల్లంకొండ సురేష్ కేంద్రబిందువు కావడం విశేషం. నందమూరి అభిమానిగా సురేష్ ఈ రోజు హైదరాబాద్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆఖరికి బాలయ్యను బధిరుల దగ్గరకు కూడా తీసుకువచ్చేట్లు చేశారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. రెండు నెలల్లోనే బాలయ్య హీరోగా బెల్లంకొండ సురేష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నానని, త్వరలో ఆ సినిమా తెరపైకి రానుందని తెలియజేశారు. పరుచూరి కిరిటీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని సురేష్ వివరించారు.
ఇదిలా ఉండగా.. దేవనార్ బధిరుతల పాఠశాలలో నందమూరి బాలకృష్ణ తన 50వ పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. 50కేజీల కేకను కట్‌చేసి విద్యార్థులకు అందించి కొద్దిసేపు వారితో సరదాగా గడిపారు. వారికోరిక మేరకు "మంగమ్మగారి మనవడు" చిత్రంలోని 'దంచమే మేనత్తకూతురా' పాటను పాడి వారిని ఆనందపరిచారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, దేవనార్ పాఠశాలలో విద్యార్థుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చుదిద్దుతున్న నిర్వాహకులను అభినందించారు.
తాతమ్మకలతో 1974లో నటుడిగా ప్రవేశించిన బాలకృష్ణకు నటుడిగా 35 ఏళ్ళుపూర్తయ్యాయి. ఈ వేడుకలను బెల్లంకొండ సురేష్ నిర్వహించారు.