Sarvanand| Rubi| Prasthanam| Sai Kumar| Deva katta | శర్వానంద్ "ప్రస్థానం" ప్రారంభం
|
శ్రీశ్రీ మహాప్రస్థానంలా.. తన ప్రస్థానం మానవీయ విలువలను, తరాలమధ్య విలువలు ఏ స్థాయిలో ఉన్నాయని చెబుతూ.. చక్కటి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇస్తున్నామని దర్శకుడు చెప్పారు.
35 ఏళ్ళుగా తాను పోషించని ఒక విభిన్నమైన పాత్రను ప్రస్థానంలో పోషిస్తున్నానని సాయికుమార్ చెప్పారు. ఢిల్లీకి చెందిన రూబీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇంకా ఈ చిత్రానికి 'పూంఖ్' సినిమాకు కెమెరామెన్‌గా పనిచేసిన సవితా సింగ్ పనిచేస్తుంది. టెక్నికల్‌గా హైవాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాత చెప్పారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని దీపావళికి శర్వానంద్ ప్రస్థానం తెరపైకి వస్తుందని ఆయన తెలిపారు.