1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. మంచు మనోజ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

Manchu Manojkumar, Sheena, Movie, Prayanam | మంచు మనోజ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

మంచు మనోజ్
WD
నేను మీకు తెలుసా?, ప్రయాణం ఫేమ్ మంచు మనోజ్‌కుమార్‌ హీరోగా షీనా హీరోయిన్‌గా నటిస్తోన్న కొత్త చిత్రం షూటింగ్ నానక్ రామ్‌గూడాలో బుధవారం ప్రారంభమైంది.

ఏటీవీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తుండగా, వీరూపోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు, మోహన్‌బాబు తదితరులు హాజరయ్యారు.

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వీరూపోట్లతో తమది గురుశిష్యుల సంబంధమన్నారు. తమ చిత్రాలకు చాలా రచనలు చేశాడని ఆయన అన్నారు.

దర్శకుడు వీరూపోట్ల మాట్లాడుతూ... మనోజ్‌ చాలా హార్డ్‌వర్క్‌ చేస్తాడు. చిత్ర నిర్మాతకూ స్క్రీన్‌ప్లేపై అవగాహన ఉంది. ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ చిత్రం. సాధారణంగా మనోజ్ మనసులో ఏదీ దాచుకోకుండా ఠక్కున చెప్పేవాడు‌. ఈ చిత్రంలోనూ అతని పాత్ర అలాగే ఉంటుందని దర్శకుడు అన్నారు.

ఈనెల 12న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూన్‌ 3న రెండవ షెడ్యూల్‌ ప్రారంభించి పూర్తయ్యేవరకు సినిమాను షూట్‌ చేస్తామని వీరూపోట్ల తెలిపారు.

హీరో మనోజ్‌ మాట్లాడుతూ.. రాజుభయ్యా చిత్రం తర్వాత నిర్మాత రామబ్రహ్మం ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. కానీ సమయం కుదరలేదు. ఇన్నాళ్లకు అన్ని కలిసొచ్చి రామబ్రహ్మంతో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. తప్పకుండా ఈ చిత్రం మంచి సక్సెస్‌ అవుతుందని మనోజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నటుడు విశ్వనాథ్‌ కాశీ మాట్లాడుతూ.. వీరూ పోట్లా సినిమాల్లో నటునిగా తనకు అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. మనోజ్ తాజా చిత్రంలో హీరోయిన్‌ తండ్రిగా నటిస్తున్నానని కాశీ చెప్పారు.

విజయకుమార్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, ఆహుతిప్రసాద్‌, సునీల్‌, ఎం.ఎస్‌.నారాయణ, బెనర్జీ, జీవా, విజయరంగరాజు, తెలంగాణ శకుంతల, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: భువనచంద్ర, సంగీతం: బోబో శశి, కెమెరా: రమేష్‌బాబు, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిషోర్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరూపోట్ల.
About Writer
SELVI.M