1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Y.S. Rajasekara Reddy

Nithin| Y.S. Rajasekara Reddy| Hansika | వైఎస్సార్‌చే "నితిన్" కొత్త చిత్రం ప్రారంభం

నితిన్
WD
యువ కథానాయకుడు నితిన్‌హీరోగా, హన్సిక హీరోయిన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం గురువారం సి.ఎం. క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభమైంది.

నితిన్‌పై తీసిన తొలిషాట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి క్లాప్‌ కొట్టగా, గిరిజన సంక్షేమశాఖా మంత్రి బాలరాజు కెమేరా స్విచ్చాన్‌ చేశారు. గీతారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

సిద్ధు ఫ్రమ్‌ సికాకుళం నిర్మాత విజయప్రసాద్‌ మల్లా (ఎం.ఎల్‌.ఎ.) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహిచిన ఈశ్వర్‌ దీనికి దర్శకుడు.

ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత మాట్లాడుతూ, తమ నిర్మించిన తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. అలాగే ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకముంది. ముఖ్యమంత్రి చేతులమీదుగా నితిన్ కొత్త చిత్రం ప్రారంభం కావడం మరింత ఆనందంగా ఉందన్నారు.

ఈనెల 23 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. హైదరాబాద్‌ పరిసరప్రాంతాల్లో నాలుగు షెడ్యూల్లో టాకీ పూర్తిచేస్తామని, అక్టోబర్‌లో విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుగుతుందని విజయ్‌ప్రసాద్ చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ, తమ తొలి చిత్రాన్నే ప్రేక్షకులు సక్సెస్‌ చేశారని, ఈ చిత్రాన్ని అంతటి స్థాయిలో తెరకెక్కించేందుకు చేయడానికి కృషి చేస్తామన్నారు.

హీరో నితిన్‌ మాట్లాడుతూ, తన తాజా చిత్రం సి.ఎం. చేతులమీదుగా ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. వైవిధ్య కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తనకు మంచి గుర్తింపును సాధించిపెడుతుందని ఆశించారు.
About Writer
SELVI.M