Allu Arjun, Manchu Manoj, Vedam, Multy Starerr Movie, Krish | అల్లు అర్జున్, మనోజ్‌ల "వేదం" ప్రారంభం
|
శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సిటీమ్యాక్స్‌లో ఈ సినిమా షూటింగ్‌ను పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ఆరంభించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సినిమా గురించి తెలియజేస్తూ... ఇద్దరు హీరోలయితే అల్లుఅర్జున్ చేయరని భావించాను. కానీ కథ విన్నాక అర్జున్ చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారని తెలిపారు.
అదేవిధంగా మంచు మనోజ్‌ను జిమ్‌లో కలిసి అల్లు అర్జున్ తన విషయం చెప్పారు. ఆ తర్వాత తాను కూడా అడగడంతో మనోజ్ వెంటనే అంగీకరించడం బలాన్నిచ్చిందని దర్శకుడు తెలిపారు.
ఈ కాంబినేషన్‌ను చిరంజీవి, మోహన్‌బాబులుకూడా విని చాలా పాజిటివ్‌గా స్పందించారు. మీలాంటి వారు కలిసిచేస్తే రేపు మీ బాటలో పదిమంది నడుస్తారని ధైర్యం నూరిపోశారని క్రిష్ చెప్పారు. 'వేదం' అంటే లవ్‌స్టోరీకాదు. హ్యూమన్ ఎమోషన్స్‌కు సంబంధించిన కథ. ముఖ్యంగా ఇందులో ఐదు పాత్రలు కీలకమని దర్శకుడు వివరించారు.
ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ.. ఈ సినిమాలో 8 పాటలున్నాయని, మాస్‌ను ఆకట్టుకునే రీతిలో ఇవి ఉంటాయని చెప్పారు. ఇది మల్టీస్టారర్ సినిమా. హీరోనే కథ. ముఖ్యంగా ముసలివ్యక్తి పాత్ర కీలకం. అదే సినిమాను నడిపిస్తుందని హీరో అల్లు అర్జున్ అన్నారు. చిరంజీవికి కథ చెప్పిన వెంటనే చాలా ధైర్యం చెప్పారని, గమ్యం హిట్ అయిన తరుణంలోనే క్రిష్‌ను చిరు అభినందించారని అల్లు అర్జున్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఇందులో తనది ఆనంద్‌రాజ్ పాత్ర. క్రిష్ సినిమా అయితే విలన్‌గా చేయడానికి సిద్ధమని ఆయనతో ఓ సందర్భంలో చెప్పాను. దాన్ని గుర్తు పెట్టుకుని ఈ సినిమాలో తనకు ఈ ఛాన్స్ ఇచ్చారు. హాలీవుడ్ టెక్నాలజీతో క్రిష్ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నారని మనోజ్ తెలిపారు.
డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: వి.ఎస్. జ్ఞానశేఖర్.