1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Vesavi Selavullo| Cinema| Audio| Release| Sri Kanth| Sidhi | ''వేసవి సెలవుల్లో'' ఆడియో విడుదల

వేసవి సెలవుల్లో
WD
శ్రీకాంత్‌, సిద్ధి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ చందు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'వేసవి సెలవుల్లో' సినిమా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది.

అగస్త్య ప్రొడక్షన్స్‌పై అగస్త్య, నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. గురువారం రాత్రి ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌.వి. కృష్ణారెడ్డి ఆడియో ఆవిష్కరించి వి.వి. వినాయక్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా... నిర్వాహకులు అతిథులంతా వేసవి సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేశారో తెలియజెప్పే కాంటెస్ట్‌‌ను నిర్వహించారు. ఈ కాంటెస్ట్‌ ద్వారా అతిథులంతా తమ అనుభవాలను పంచుకున్నారు.

వినాయక్ మాట్లాడుతూ.. చందు చక్కని టాలెంట్‌ గల దర్శకుడని కొనియాడారు. టెన్త్‌క్లాస్‌ అనే సినిమాతో తన సత్తాను నిరూపించుకున్నాడని చెప్పారు. సంగీతదర్శకుడు ప్రవీణ్‌మొగల్‌ ఈ సినిమాకు మంచి సంగీతం అందించారు. ఆయనకు మంచి భవిష్యత్‌ ఉందని అన్నారు. ఇందులోని మూడు పాటలు చాలా బాగున్నాయని వినాయక్ ప్రశంసించారు.

హీరోహీరోయిన్లు శ్రీకాంత్‌, సిద్ధి మాట్లాడుతూ.. తాము ఈ చిత్రంలో నటించడం ద్వారా నటనలోని మెళకువలను చాలా నేర్చుకున్నామనీ, ఈ చిత్రం సక్సెస్‌తో మంచి గుర్తింపు లభిస్తుందని ఆశించారు.
About Writer
SELVI.M