1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ప్రభాస్‌-కరుణాకరన్‌ కాంబినేషన్‌లో కొత్త చిత్రం

Prabhas, Karunakaran, Prabhu, Prasad, Kajal Agarwal | ప్రభాస్‌-కరుణాకరన్‌ కాంబినేషన్‌లో కొత్త చిత్రం

ప్రభాస్
WD
ప్రభాస్‌ హీరోగా 'తొలిప్రేమ' దర్శకుడు కరుణాకరన్‌ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం శుక్రవారం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై 'ఛత్రపతి' ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

దేవుని పటాలపై చిత్రీకరించిన తొలిషాట్‌కు కరుణాకరన్‌ తండ్రి అళగర్‌స్వామి క్లాప్‌ కొట్టగా, హీరో ప్రభాస్‌ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఛత్రపతి తర్వాత ప్రభాస్‌ చేస్తున్న భారీ చిత్రమిది. కరుణాకరన్‌ చాలా మంచి కథతో ముందుకు వస్తున్నారు. కమర్షియల్‌ అంశాలున్న ఈ చిత్రం మంచి సక్సెస్‌ అవుతుందని ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

హీరో ప్రభాస్‌ మాట్లాడుతూ.. కరుణాకరన్‌ చెప్పిన కథ నచ్చిందన్నారు. లవ్‌స్టోరీలోనే వైవిధ్యమైన కోణంతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు సిద్ధమయ్యారని చెప్పారు. ఇంకా ప్రసాద్‌ పతాకంపై తాను నటించే ఈ సినిమా తప్పకుండా గుర్తింపు సంపాదించి పెడుతుందని ప్రభాస్ నమ్మకం వ్యక్తం చేశారు.

దర్శకుడు కరుణాకరన్‌ మాట్లాడుతూ... ఇంతకుముందు ఎన్నో లవ్‌స్టోరీలు వచ్చాయి. కానీ ఇదో ట్రెండ్‌. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు ఈ సంఘటనలు మన లైఫ్‌లోకూడా జరిగాయే అన్న ఫీల్‌ కలుగుతుందని తెలిపారు.

ప్రభాస్‌ ఇమేజ్‌కు తగ్గట్లుగా యాక్షన్‌ అంశాలను మిళితం చేసి అందమైన లవ్‌స్టోరీగా రూపొందిస్తున్నామని దర్శకుడు చెప్పారు. జులై మొదటివారం నుంచి ఏకధాటిగా జరిగే సింగిల్‌షెడ్యూల్‌తో చిత్రాన్ని పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.

ఇకపోతే.. ప్రభాస్‌ సరసన సెక్సీడాళ్ కాజల్‌ అగర్వాల్ నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలోని కీలక పాత్రను తమిళ హీరో ప్రభు పోషిస్తున్నారు.
About Writer
SELVI.M