Sankham| Shooting| Gopi Chand| Birth Day| Trisha | "శంఖం" షూటింగ్‌లో గోపిచంద్ పుట్టినరోజు
|
తాజాగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై "శౌర్యం" చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న భారీ చిత్రం "శంఖం"లో గోపిచంద్ నటిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలింసిటిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. గురువారం హీరో గోపిచంద్ బర్త్ డే కావడంతో యూనిట్ సభ్యుల నడుమ గోపిచంద్ కేక్ కట్ చేసి పుట్టినరోజును జరుపుకున్నారు.
చిత్ర నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు, దర్శకుడు శివ, నటులు కోట శ్రీనివాసరావు, సుప్రీత్ తదితరులు హీరో గోపిచంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు.. తన పుట్టినరోజు సందర్భంగా గోపిచంద్ ఘట్‌కేసర్ పోగారంలోని స్వచ్ఛంధ సంస్థ అంకురం విమెన్ అండ్ ఛైల్డ్ డెవలప్‌మెంట్ సొసైటీకి వెళ్ళి అక్కడి అనాధ పిల్లల మధ్య బర్త్ డే కేక్ కట్ చేశారు. అనంతరం ఆ స్వచ్ఛంధ సంస్థకు రూ. 1,50,000ల విరాళాన్ని అందజేశారు.
అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని జూనియర్ ఆర్టిస్టుల పిల్లల చదువుకోసం జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు రూ. 25వేలను విరాళంగా అందించారు.