Thejam| Audio| Preety jhangiani| Item Song| Venkatesh | "తేజం" ఆడియో ఆవిష్కరణ
|
ఆడియో విడుదల సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ, ఇందులోని పాటలు ఉత్తేజభరితంగా ఉన్నాయని చెప్పారు. వెంకటేష్ హీరోగా నటించిన 'పవిత్రబంధం' సినిమాకు అసిస్టెంట్‌గా చేరాను. అప్పటినుంచి తేజం చిత్ర దర్శకుడు గోపి... వెంకటేష్ ఫ్యాన్స్‌కు ఉత్తరాలు రాస్తుండేవారు. వాటితోపాటు కథలుకూడా రాసేవాడు. అతను తీసిన ఆర్ట్ ఫిలిం మూడు నంది అవార్డులు సాధించింది. చక్కని సందేశంతోకూడిన తేజం సినిమా కూడా తప్పకుండా హిట్టవ్వాలని ఆకాంక్షించారు.
దర్శకుడు గోపి మాట్లాడుతూ, తాను దాదాపు పన్నెండు సంవత్సరాలు వెంకటేష్ వద్ద పనిచేశాననీ, ఎన్నో కథలు రాసే అవకాశం కల్గిందని కొత్తవారితో రూపొందించిన తేజం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని తెలిపారు.
నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రీతిజింగ్యానియా ఓ ప్రత్యేకపాట చేసింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తయి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. పదిరోజుల్లో తొలికాపీ సిద్ధంకానుందన్నారు
ఇంకా ఈ చిత్రంలో సర్దార్‌ఫటేల్, సురేష్, మహేష్, వినోద్, వివేక, ఆర్.జె.రాజ్, గౌతమ్, జయవర్ధన్, మోనీషా కొత్తగా పరిచయం కాగా, మిగిలిన పాత్రల్లో ఎం.ఎస్. నారాయణ, బ్రహ్మానందం, సుభాషిణి, రమ్యచౌదరి, ఫణి, సూర్య తదితరులు నటిస్తున్నారు.
ఇంకా ఈ చిత్రానికి కెమెరా: ఎం. నాగేంద్రకుమార్, పాటలు: జొన్నవిత్తుల, శివ, శిరీష్, రాజేష్‌ఖన్నా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్.కె.ఎస్.గోపి.