1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Pavan kalyan

Kushi| Pavan kalyan| S.J. Surya| Komaram Puli | జూలై 1 నుంచి ఏకధాటిగా "కొమరం పులి" షూటింగ్

ఖుషి
WD
"ఖుషి" సినిమా తర్వాత పవన్‌కళ్యాణ్‌, ఎస్‌.జె. సూర్య కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ చిత్రం "కొమరం పులి".

ఈ సినిమా షూటింగ్ జులై ఒకటో తేదీ నుంచి ఏకధాటిగా చిత్రం పూర్తయ్యే వరకు జరుగుతుందని నిర్మాత శింగనమల రమేష్ తెలిపారు.

పవన్‌కళ్యాణ్‌ సినీ కెరీర్‌లో కొమరం పులి సెస్సేషనల్‌ చిత్రమవుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.

నిఖిషా పటేల్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మనోజ్‌బాజ్‌పారు, చరణ్‌రాజ్‌, జ్యోతికృష్ణ, శరణ్య, బ్రహ్మాజీ, అలీ, కోవైసరళ, విఎంసి హనీఫా, గిరీష్‌ కర్నాడ్‌ తదితరులు నటిస్తున్నారు.

ఇంకా ఈ సినిమాకు కెమెరా: బినోద్‌ ప్రధాన్‌, సంగీతం: ఎ.ఆర్‌. రెహమాన్‌, ఆర్ట్‌: ఆనందసాయి, ఫైట్స్‌: విజయన్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బి. బుల్లిసుబ్బారావు, సమర్పణ: ఎస్‌. సత్యరామమూర్తి, నిర్మాత: శింగనమల రమేష్‌బాబు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఎస్‌జె. సూర్య.
About Writer
SELVI.M