Mahesh Babu| Trivikram| Anushka| Rajasthan | రాజస్థాన్‌లో మహేష్‌బాబు, అనుష్క
|
కనకరత్న మూవీస్ పతాకంపై ఎస్. సత్యరామ్మూర్తి సమర్పణలో శింగనమల రమేష్‌బాబు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్‌ను ఇటీవలే 15 రోజులపాటు బ్యాంకాక్‌లో చిత్రీకరించారు.
ఈ చిత్రం వివరాలను ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి. బుల్లి సుబ్బారావు తెలియజేస్తూ.... ఈనెల 23 నుండి రాజస్థాన్‌లో భారీ షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నామన్నారు. ఆగస్టు 6వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ చిత్రీకరిస్తామని చెప్పారు.
నిర్మాత శింగనమల రమేష్ మాట్లాడుతూ... మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇది ఓ సెస్సేషనల్ ఫిలిమ్ అవుతుందని తెలిపారు. డిసెంబర్ కల్లా నిర్మాణ పనులు పూర్తవుతాయని నిర్మాత వివరాలందించారు.
అరుంధతి తార అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, సునీల్, బ్రహ్మానందం, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ, ఎం.ఎస్. నారాయణ, షఫీ, అమిత్, అమన్‌ధారీవాలా, శ్రీరంజని, నైనాదీక్షిత్, సుప్రియా కార్నిక, మాధురి ఇతిక, ప్రభు తదితరులు నటిస్తున్నారు.
ఇంకా ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: సునీల్‌పటేల్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, ఆర్ట్: ఆనందసాయి, డాన్స్: రాజుసుందరం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. బుల్లిసుబ్బారావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: త్రివిక్రమ్.