Raja Sekar| Bhoomika| Na style veru| Jeevitha | కలెక్షన్ల వెల్లువలో "నా స్టైలే వేరు"
|
మంగళవారంనాడు జూబ్లీహిల్స్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సినిమా చూసివాళ్ళంతా చాలా బాగుంది అంటున్నారనీ, మంచి కలెక్షన్లు వస్తున్నాయనీ, ఇదంతా సమిష్టికృషితో సాధ్యమైందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టినప్పుడు కథకు సూటవ్వదేమోననే సందేహం తనకు కల్గింది. కానీ విడుదల తర్వాత ప్రతి ఒక్కరూ చాలా బాగుందని అంటున్నారని చెప్పారు.
ఈ సినిమాకు టైటిల్ ప్లస్ అవుతుందని అనుకోలేదు. ఈ సినిమాలో తాను కామెడీ బాగా చేశానని అందరూ మెచ్చుకుంటున్నారని రాజశేఖర్ తెలిపారు. ఇందులో తాను కామెడీ చేయడానికి దర్శకుడే ముఖ్యకారణమని, డాన్స్ కూడా తనచేత బాగా చేయించాడని చెప్పారు.
ఈ సినిమా చేయ్యండని జీవిత పట్టుబట్టి మరీ చేయించిందని, నిర్మాత ఈ సినిమా విడుదలకు ముందే చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారని రాజశేఖర్ వివరించారు. నా స్టైలే వేరు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు రాజశేఖర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
జీవిత మాట్లాడుతూ.. ఈ సినిమా చేయమని రాజశేఖర్‌ను చాలా ఫోర్స్ చేశానన్నారు. ఇది కటుంబసమేతంగా చూడతగ్గ చిత్రమని, చూసినవారంతా బాగుందని మెచ్చుకుంటున్నారని ఆమె వెల్లడించారు.
ఇకపోతే ఈ మధ్య ఎవరుబడితే వారు నెట్‌లలో రాజశేఖర్‌గారి గురించి ఏవేవో రాసేస్తున్నారని, పాఠకులను తప్పు పట్టించే వార్తలు రాయకూడదని జీవిత మనవి చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రవిప్రకాష్, విజయరంగరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.