Shiney Ahuja| Deputy Commissioner of Police| Niket Kaushik| rape | అవును, పనిమనిషిపై అత్యాచారం చేశా..!: అహుజా
|
అహుజా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అహుజాను ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పనిమనిషికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెపై లైంగిక దాడి జరిగిందని ఇప్పటికే రుజువైనట్లు డీసీపీ నికిత్ కౌషిక్ తెలిపారు.
అంతకుముందు అహుజా భార్య తన భర్త అటువంటి వ్యక్తి కాదని చెప్పుకుంటూ వచ్చింది. అయితే వైద్య పరీక్షల్లో అహుజా పనిమనిషిపై అత్యాచారం చేశాడని రుజువు కావడంతో అతనే తన తప్పును ఒప్పుకున్నాడని తెలిసింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల సమయంలో జరిగినట్టు ఆ యువతి చెప్పింది. సంఘటన జరిగిన తర్వాత యువతి తన బంధువుల ఇంటికి వెళ్లిందని, అక్కడ నుంచి సొంతవారిని వెంటబెట్టుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నికిత్ కౌషిక్ వివరించారు.