1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Arthi Agarwal

NeelaVeni| Arthi Agarwal| Bollywood| Mukul Dev | ''నీలవేణి''గా వస్తోన్న ఆర్తి అగర్వాల్‌!

నీలవేణి
WD
ఆర్తి అగర్వాల్‌ ప్రధాన పాత్ర ధారిణిగా "నీలవేణి" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎం.జి.ఆర్‌. కంబైన్స్‌ అనే నూతన నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్‌ పారేపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఆర్తీ అగర్వాల్ సరసన బాలీవుడ్‌ నటుడు ముకుల్‌దేవ్‌ హీరోగా నటించబోతున్నారు.

ప్రస్తుతం ముకుల్‌దేవ్ ఎన్‌.టి.ఆర్-వినాయక్‌ల కాంబినేషన్‌ చిత్రంలోనూ, ప్రభాస్‌-పూరి జగన్నాథ్‌ల ఏకనిరంజన్‌లోనూ కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. వివాహానంతరం అమెరికా నుండి తిరిగొచ్చిన ఆర్తి షూటింగ్‌లో పాల్గొనబోతున్న తొలిచిత్రం నీలవేణి.

ఆర్తి అగర్వాల్‌ ఇమేజ్‌కు తగ్గుట్లుగా ఫ్యామిలీ ఎమోషన్స్‌, భరత్‌పారేపల్లి స్టైల్లో మాస్‌‌కు నచ్చే అంశాలతో వైవిధ్యభరితంగా నీలవేణి రూపుదిద్దుకోనుందని అని ఎం.జి.ఆర్‌. కంబైన్స్‌ ప్రతినిధి తెలిపారు.

ప్రస్తుతం పాటల రికార్డింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల 27న ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
About Writer
SELVI.M