1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Nani

Ride| Nani| Tanish| Swetha Basu| Bellam Konda Suresh | మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న "రైడ్"

మాస్
WD
తనీష్‌, నాని హీరోలుగా నటించిన చిత్రానికి ప్రేక్షకాదరణ రోజురోజుకూ పెరుగుతుందని చిత్ర సమర్పకుడు బెల్లకొండ సురేష్‌ తెలిపారు.

బుధవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు, హేమచంద్ర సంగీతం చిత్ర విజయానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.

మంచి చిత్రాలు తీస్తే ప్రేక్షకులు చూస్తారని రైడ్‌ ద్వారా నిరూపించామని బెల్లంకొండ సురేష్ అన్నారు. రోజురోజుకూ కలెక్షన్లు పెరుగడంతో పాటు మాస్ ప్రేక్షకులను రైడ్ ఆకట్టుకుంటోందని చెప్పారు. త్వరలో రమేష్‌వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నానని తెలిపారు.

యంగ్ హీరో తనీష్‌ మాట్లాడుతూ, రైడ్‌ కథ చాలా ఫాస్ట్‌గా సాగుతుందని, తనకు నాని పూర్తి సపోర్ట్‌ చేశారు. 'దంచవేమేనత్త...' కూతురా పాటకు ప్రేక్షకుల నుంచి విజిల్స్‌‌ వచ్చాయని వెల్లడించారు.

నాని మాట్లాడుతూ, రెండవ సినిమాతో సక్సెస్‌ సాధించామని తెలిపారు. తొలి సినిమా తర్వాత కాస్త భయపడ్డానని నాని చెప్పారు. కానీ రైడ్ విజయంతో ఆ భయం పోయిందన్నారు.

హీరోయిన్ శ్వేతబసుప్రసాద్‌ మాట్లాడుతూ, థియేటర్లో ఈ చిత్రాన్ని చూశాననీ, ప్రేక్షకుల ఆదరణ బాగుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాశీవిశ్వనాథ్‌, శశాంక్ వెన్నెలకంటి తదితరులు కూడా మాట్లాడారు.
About Writer
SELVI.M