Shiney Ahuja | wife Anupam | maidservant | rape | మా ఆయన చాలా మంచోడు: అనుపమ్ షైనీ
| బాలీవుడ్ నటుడు షైనీ అహుజా తమ పని మనిషిపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నప్పటికీ, అతని భార్య మరియు కుటుంబ సభ్యులు మాత్రం అహుజా అమాయకుడంటున్నారు. ఈ విషయంలో షైనీకి అండగా నిలిచి పోరాడతామంటున్నారు. |
షైనీ భార్య అనుపమ్ అహుజా మాట్లాడుతూ, " నా భర్త క్యారెక్టర్ ఏమిటో నాకు బాగా తెలుసు. అతను అమాయకుడు. ఎవరో కావాలని నా భర్తను ఈ ఉచ్చులో ఇరికించారు. ఇటువంటి సమయంలో అర్థాంగిగా ఆయనవైపు నిలబడి న్యాయం కోసం పోరాడతాను. షైనీకి మేము ఎప్పటికీ దూరం కాబోము" అని పేర్కొన్నది.
ఇదిలా ఉండగా బాలీవుడ్ దర్శకుడు సుధీర్ మిశ్రా సైతం షైనీతో రెండు చిత్రాలు చేశాననీ, ఆ సమయంలో అతడి ప్రవర్తన ఎంతో హుందాగా ఉండేదనీ, అతను ఇటువంటి పనికి పూనుకున్నాడంటే నమ్మలేనని అన్నాడు. అయితే కోర్టు తీర్పును గౌరవించక తప్పదన్నాడు. బాలీవుడ్‌లో మరికొందరు దర్శక నిర్మాతలు మాత్రం షైనీ అత్యాచారం రుజువైన పక్షంలో అతడిని శిక్షించాల్సిదేనని వ్యాఖ్యానించారు.
