1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Jeevitha

Rajasekar| Jeevitha| Freedom| Na style veru| Gorintaku | రాజశేఖర్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన జీవిత!

రాజశేఖర్
WD
"తలంబ్రాలు"తో ఒక్కటయిన జీవితా రాజశేఖర్‌లు ఇంట్లో ఎలా ఉంటారో గానీ..? బయట మాత్రం చాలా అన్యోన్యంగా కన్పిస్తారు.

ఒకరిని విడిచి మరొకరు ఉండలేరేమోనని అనిపిస్తుంటుంది. ఈమధ్య రాజశేఖర్‌పై పలువెబ్‌సైట్లు రకరకాలైన వార్తలు రాయడంపట్ల జీవిత మండిపడ్డారు.

"నా స్టైలేవేరు" సినిమా ఆలస్యం కావడానికి రాజశేఖర్‌కు కాలు బెణిగింది. ఏదో యాక్సిండెంట్‌ అయిందంటూ.. రకరకాలుగా రాసేస్తున్నారంటూ ధ్వజమెత్తింది. అందుకే వార్తలు తెలిసిరాయాలని చురక వేసింది.

అదెలాగున్నా... రాజశేఖర్‌ను ఈ మధ్య జీవిత చాలా ఫ్రీగా వదిలేసింది. హాయిగా హీరోయిన్లతో చెట్టపట్టాలేసుకుని తిరగమని ప్రోత్సహించిన ఆదర్శ మహిళ అంటూ... నటుడు చలపతిరావు తనదైన శైలిలో "నా స్టైలేవేరు" చిత్ర విజయసభలో అన్నారు. వెంటనే.. జీవిత కలుగజేసుని.. అది సినిమాల్లో మాత్రమే.. అండర్‌లైన్‌ చేసుకోండని నవ్వులు పూయించింది.

వెంటనే హీరో రాజశేఖర్‌ అందుకుని... జీవిత తనకు చాలా కోపరేట్‌చేస్తుంది. ఈ సినిమా చేయడానికి జీవితే కారణం. లేదంటే మంచి సినిమా మిస్‌ అయ్యేవాడినని చెప్పారు. గోరింటాకు కూడా జీవిత వల్లే చేశాను. అలాగే అందమైన అమ్మాయిలతో ఎగిరాను అంటే...? దానికి కూడా జీవితనే కారణమని రాజశేఖర్ హాస్యోక్తులు విసిరారు.
About Writer
SELVI.M