Gossip| News Paper| Bellam Konda Suresh| Raviteja| Lakshmi Ray | ఆ పత్రిక.. గాసిప్ పేపర్లా తయారైంది: బెల్లంకొండ
|
తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఆయన ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ చిత్రంలో హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయలేదు.
ఈ నేపథ్యంలో.. బుధవారం బెల్లంకొండ ఆఫీసుకు లక్ష్మీరాయ్ (కాంచనమాల కేబుల్‌టీవీ- ఫేమ్) వచ్చింది. అది తెలుసుకుని వెంటనే ప్రశ్నార్థకంతో బెల్లంకొండ కొత్త చిత్రంలో రవితేజ సరసన లక్ష్మీరాయ్ నటించనున్నట్లు ఆ పత్రిక ప్రచురించింది. దీంతో బెల్లంకొండ ఆగ్రహం చెందారు. కోట్లుపెట్టి నిర్మించే సినిమాకు ఇలాంటి లేనిపోని రాతల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ మండిపడ్డారు.
ఇటువంటి వార్తలను మీ ఛైర్మన్ నిర్మించే చిత్రాలకు ఎందుకు రాయరని బెల్లంకొండ సూటిగా ప్రశ్నించారు. గురువారం బాలయ్యతో 'భీష్మ' చిత్రం ఎనౌన్స్‌మెంట్ సందర్భంగా వచ్చిన విలేకరిపై బెల్లంకొండ వేసిన ప్రశ్నలకు ఆ పత్రిక విలేకరి, ఫొటోగ్రాఫర్ తెల్లమొహం వేశారు. పైగా ఆ విలేకరి మీరు చెబుతున్నట్లు రాయలేదని.., అనుమాన స్పందగా తెలిసింది అని మాత్రమే రాశామని ఎంత చెప్పినా... బెల్లంకొండ ససేమిరా అన్నారు.
మీ రాతల వల్ల రవితేజ సినిమా చేయనని, కృష్ణవంశీ.. కూడా ఏదో కారణం చూపి సినిమా వాయిదావేస్తే అడ్వాన్సులు ఇచ్చిన తన పరిస్థితి ఏమిటిని...? బెల్లంకొండ ప్రశ్నించడంతో ఆ విలేకరికి నోటి మాటరాక వెంటనే అక్కడనుంచి వెళ్ళిపోయారు. చివర్లో వారిని పిలిచి బెల్లంకొండ సర్దుబాటు కార్యక్రమం చేశారు. దీనికి తోడు విలేకరి, ఫోటోగ్రాఫర్‌తో పాటు ఆ పత్రిక ఇన్‌ఛార్జ్‌కూడా వచ్చి సర్దుబాటు కార్యక్రమంలో పాల్గొన్నారు.