1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Ragavendra Rao

Sidharth| Ragavendra Rao| Prakash| Raja Mouli| Krish | "సిద్ధార్థ" హీరోగా రాఘవేంద్రరావు కొత్త చిత్రం

సిద్ధార్థ
WD
సిద్దార్థ హీరోగా కె. రాఘవేంద్రరావు నిర్మాతగా అతని కుమారుడు ప్రకాష్‌ దర్శకునిగా తెలుగు, హిందీ భాషల్లో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు.

'ఎ బెల్లీ ఆఫ్‌ డ్రీమ్స్‌' ద్వారా దర్శకునిగా జాతీయస్థాయి అవార్డుపొందిన ప్రకాష్‌ ఆ చిత్రం పేరుతోనే బేనర్‌ను స్థాపించారు.

ఈ చిత్ర విశేషాలను తెలియజేసేందుకు గురువారం సినీమాక్స్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ప్రకాష్ మాట్లాడుతూ.. ''నాన్నగారు చేసిన అన్నమయ్య, జగదేకవీరుడు అతిలోక సుందరి' చిత్రాలంటే తనకెంతో ఇష్టమన్నారు.

అలాంటి ఫాంటసీ ఎలిమెంట్‌తో నూతన చిత్రానికి స్క్రిప్ట్‌ రాసుకున్నానని, సిద్ధార్థను తెలుగు ప్రేక్షకులు లవర్‌బాయ్‌గా చూశారు. హిందీలో 'రంగెదేబసంతి 'ద్వారా వైవిధ్య నటునిగా చూశారు. తన కొత్త చిత్రంలో అంతకంటే భిన్నమైన పాత్రలో సిద్ధార్థను చూస్తారని ప్రసాద్ వివరించారు. ఇందులో సిద్ధార్థ ద్విపాత్రాభినయం చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ ఆగస్టు మొదటివారంలో ప్రారంభించనున్నామని'' ప్రకాష్‌ వెల్లడించారు.

హీరో సిద్దార్థ మాట్లాడుతూ... తెలుగు సినీ చరిత్రలో లెజెండ్‌ కె. రాఘవేంద్రరావు. ఆయన సినిమాలో చేయాలని అనుకునేవాడిని. మాస్‌ హీరోగా ఆయన చిత్రంలో నటిస్తే నిలబడిపోతామని రాజమౌళిను చూస్తే అనిపించేంది. ఈమధ్యనే తెలుగు సినిమాను కొత్త ఒరవడిలోకి తీసుకెళ్తున్న రాధాకృష్ణ (క్రిష్‌) చిత్రాలు కూడా చూశాను. ఈ ముగ్గురిలోని క్వాలిటీస్‌ ప్రకాష్‌లో వున్నాయని సిద్ధార్థ వెల్లడించారు.

ఇన్నాళ్ళు తనను ప్రేక్షకులు నటుడిగా గుర్తించారని ప్రకాష్‌ చిత్రం ద్వారా మాస్ హీరోగా నిలబెడతారని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రాంతీయ చిత్రాల్లో తెలుగును చులకనగా చూస్తూ ఇతర భాషలతో పోలుస్తుంటారు. వారందరికీ ఈ చిత్రం సమాధానం చెబుతుంది. అందుకే హిందీలోకూడా ఈ చిత్రాన్ని తీస్తున్నారని సిద్ధార్థ తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు రాజమౌళి, క్రిష్‌లు మాట్లాడుతూ, స్క్రిప్ట్‌లో ప్రకాష్‌కున్న పట్టును, సినిమాపై ఆయనకున్న అవగాహనను ప్రశంసించారు. తెలుగు సినిమా న్యూజనరేషన్‌వైపు పయనిస్తుందనేందుకు ఈ చిత్రమే నిదర్శనమని పేర్కొన్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌శేఖర్‌, నిర్మాత: కె. రాఘవేంద్రరావు.
About Writer
SELVI.M