1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. BalaKrishna

NTR| BalaKrishna| Bellam Konda Suresh| Bhisma | బాలకృష్ణతో బెల్లంకొండ ''భీష్మ''

బాలకృష్ణ
WD
ఎన్‌.టి.ఆర్‌. నటించిన 'భీష్మ' అందరికీ గుర్తుండే వుంటుంది. అటువంటి పౌరాణికం కాకపోయినా అందులోని పాయింట్‌ను సోషలైజ్‌చేసి నందమూరి బాలకృష్ణతో 'భీష్మ' అనే కొత్త చిత్రాన్ని బెల్లకొండ సురేష్‌ నిర్మిస్తున్నారు. దీనికి 'రైడ్‌' దర్శకుడు రమేష్‌వర్మ నేతృత్వం వహిస్తున్నారు.

చిత్ర విశేషాలను సురేష్‌ తెలియజేస్తూ... శ్రీసాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌పై బాలయ్యబాబుతో చెన్నకేశవరెడ్డి, లక్ష్మీనరసింహ చిత్రాలు నిర్మించామని గుర్తు చేశారు. హ్యాట్రిక్‌గా నిర్మిస్తున్న భీష్మ సినిమా షూటింగ్‌‌ను ఈ నెల 29న ప్రారంభం కానుందని తెలియజేశారు.

ఇది పౌరాణిక చిత్రం కాదని, క్యారెక్టర్‌ఫరంగా టైటిల్‌ అలా పెట్టామని సురేష్ వెల్లడించారు. ఈ చిత్రం టైటిల్‌ను కృష్ణవంశీ బాలయ్యతో చేద్దామని రిజిష్టర్‌ చేయించుకున్నారు. మా కథకు ఆ టైటిల్ సరిపోతుందని అడిగినవెంటనే కృష్ణవంశీ ఇచ్చారు. టైటిలే సబ్జెక్ట్‌కు ప్రాణమని సురేష్ వివరాలందించారు.

బాలయ్యను ఎలా ప్రజెంట్‌చేయాలో కొంతవరకు తనకు తెలుసునని, ఆయన ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఎంటర్‌టైనర్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌తో ఈ చిత్రం ఉంటుందన్నారు బెల్లంకొండ తెలిపారు. 'రైడ్‌' చిత్రాన్ని చూసి బాలయ్య రమేష్‌వర్మతో చేయడానికి అంగీకరించారని. ఇతర వివరాలు, విడుదలతేదీని ప్రారంభంరోజు వెల్లడిస్తానని ఆయన అన్నారు.
About Writer
SELVI.M