1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Dil Raju

Ram| Dil Raju| Arjun| Priya| Rama Rama Krishna Krishna | రామ్‌, దిల్‌రాజు కాంబినేషన్‌లో ''రామరామ..

రామ్
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై మస్కా హీరో రామ్‌ కథానాయకుడిగా 'లక్ష్యం' ఫేమ్‌ శ్రీవాస్‌ దర్శకత్వంలో 'రామరామ కృష్ణకృష్ణ' చిత్రం రూపుదిద్దుకోనుంది.

రామ్‌ హీరోగా, ప్రియ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో యాక్షన్‌ హీరో అర్జున్‌ ప్రధాన పాత్రను పోషించనున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు గురువారంనాడు సంస్థ కార్యాలయంలో జరిగాయి.

ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. తమ బేనర్‌పై రామరామ కృష్ణ కృష్ణ పదో చిత్రమని వెల్లడించారు. జూలై 9న ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నామని నిర్మాత అన్నారు.

గతంలో తమ సంస్థ నుండి వచ్చిన చిత్రాలు మంచి కథ, కథనాలతో, టెక్నికల్‌ వాల్యూస్‌తో రూపొందించబడి విజయవంతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం కూడా అదేవిధంగా ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకులముందు రానుందని దిల్‌రాజు అన్నారు.
About Writer
SELVI.M