Bangkok| Chettu Kinda Pelli Koduku| Paramesh| Nayana | బ్యాంకాక్ వెళ్ళనున్న "చెట్టుకింద పెళ్లికొడుకు"
|
ఈ సందర్భంగా అరుణాచలం మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో చాలా మంది యువకులకు ఉద్యోగం కంటే వివాహం జరగడం కష్టతరంగా మారింది. అటువంటి ఓ యువకుడి విచిత్రగాథే ఈ చిత్రం. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలుంటాయి. రాజ్‌కిరణ్ సంగీతసారథ్యంలో రూపొందుతున్న ఈ పాటలను సుద్దాల అశోకతేజ, బాలాదిత్య అందించారు. ఈ పాటలు ఖచ్చితంగా శ్రోతల మన్ననలను పొందుతాయని చెప్పారు.
నిర్మాత అత్నూరి ప్రభాకర్ మాట్లాడుతూ... ఇప్పటివరకు 30 శాతం టాకీతోపాటు ఓ పాట చిత్రీకరణను పూర్తయిందన్నారు. అలాగే ఈనెల 27 నుంచి బ్యాంకాక్‌లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించి రెండు పాటలతోపాటు కొంత టాకీని చిత్రీకరించనున్నామని తెలియజేశారు. ఆడియోను జులై ద్వితీయార్థంలో విడుదలచేయనున్నామని తెలిపారు.
ఇంకా ఈ చిత్రానికి కెమెరా: పూర్ణచంద్ర పొన్నాడ, ఎడిటర్: నందమూరి హరి, రచన, దర్శకత్వం: అరుణాచలం.