1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. rape

Shiney | rape | victim | love | Former maid | ఆ అమ్మాయి షైనీని ప్రేమించింది: మాజీ పనిమనిషి

బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు షైనీ అహుజా కేసు కొత్త మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. అహుజా ఇంట్లో అంతకుముందు పనిచేసిన ఓ మహిళ, అత్యాచారానికి గురికాబడ్డ అమ్మాయి షైనీని ప్రేమించిందని వెల్లడించింది. ఆ అమ్మాయే స్వయంగా ఈ విషయాన్ని తనతో చెప్పిందని తెలిపింది. 

ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం.... అత్యాచారానికి గురైన అమ్మాయి అంతకుముందే మరొక అబ్బాయితో ప్రేమలో పడిందట. అయితే అతను ఆమెను వదిలేసి సొంత ఊరులో మరో అమ్మాయిని వివాహమాడాట.

ఆ తర్వాత కొంతకాలానికి ఆమె షైనీపై మనసు పారేసుకుందట. అయితే ఇది షైనీకి తెలుసా...? అని తను అడిగితే, తెలియదనీ... కానీ షైనీని ప్రేమిస్తూనే ఉంటాననీ చెప్పినట్లు మాజీ పనిమనిషి చెప్పుకొచ్చింది. షైనీ అహుజా ఇంట్లో తను కూడా పనిచేశాననీ, అతను ఎలాంటివాడో తనకు బాగా తెలుసునని చెప్పింది.

మాజీపనిమనిషి చెపుతున్న మాటలను అత్యాచారానికి గురైన అమ్మాయి పెద్దలు కొట్టిపారేశారు. షైనీ చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT