1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Trisha

Venkatesh| Trisha| Namo Venkatesa| Adavari Matalaku Ardale Verule | వెంకీ, త్రిష జంటగా "నమో వెంకటేశ"

విక్టరీ వెంకటేష్
WD
"ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" చిత్రం తర్వాత వెంకటేష్, త్రిష జంటగా నటిస్తున్న"నమో వెంకటేశ" చిత్రం గురువారం రాత్రి నిరాబండరంగా ప్రారంభమైంది.

పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ తరహాలో శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. జూలై 25వ తేదీ నుంచి ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే కొత్త సినిమా పూజా కార్యక్రమాల్లో విక్టరీ వెంకటేష్ కూడా పాల్గొనలేదు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ట్వంటీ-20 వరల్డ్‌కప్‌కు వెళ్లిన వెంకటేష్ ఈ నెల 21న తిరిగి రానున్నారు.

14 రీల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని ఆచంట గోపినాథ్, ఆంచట రాము సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి. సురేష్‌బాబు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
About Writer
SELVI.M