King| Nagarjuna| Siva Prasad Reddy| Nenunnanu| Allari Alludu | "కింగ్" నాగార్జునతో శివప్రసాద్ రెడ్డి కొత్త చిత్రం
|
భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా గురించి నిర్మాత శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. జూలై 24వ తేదీన షూటింగ్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.
నాగార్జునతో మరో సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో అద్భుతమైన కథను సిద్ధం చేశామని నిర్మాత తెలియజేశారు. ఈ చిత్రం ద్వారా కిరణ్‌కుమార్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నామని, ప్రస్తుతం మిగిలిన నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని అన్నారు.