1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Audio

Uthsavam| Audio| Release| Hindi| Royal Uthsavam | "ఉత్సవమ్" ఆడియో విడుదల

ఉత్సవమ్
WD
ఇండో మోషన్ పిక్చర్స్ పతాకంపై హిందీలో "రాయల్ ఉత్సవమ్" పేరుతో రూపొందిన చిత్రాన్ని తెలుగులో "ఉత్సవమ్"గా అనువదించారు.

వై. సోమశేఖర్ రెడ్డి, బి.వై. రాజారెడ్డి ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. రవి కె. పట్వా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో సుప్రీం ద్వారా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది.

ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన ఉత్సవమ్ ఆడియో విడుదల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ‌ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందిన రొమాంటిక్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించిన సోమశేఖర్ రెడ్డి, రాజారెడ్డిలు ఈ చిత్ర విజయంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించారు.

ఇంకా సి. కళ్యాణ్ మాట్లాడుతూ... ప్రపంచాన్ని జయించిన మహాచక్రవర్తి అలెగ్జాండర్, తన మరణానికి ముందు యుద్ధకాంక్షను వీడి ప్రేమతత్వాన్ని తెలుసుకుంటాడు. మరుజన్మలో సికిందర్‌గా పుట్టి తన ప్రేమయాత్రను భారతదేశంలో ప్రారంభిస్తాడు.

ప్రేమకు బానిసై ఉజ్జయిని మహారాణికి అమ్ముడుపోతాడు. అతని చేష్టలు వాత్సాయుని రచనకు ప్రేరణగా ఉంటుంది. కవి కాళిదాసుని స్నేహ సాంగత్యం అతని జీవితానికి ఒక వెలుగునిస్తుంది. ఈ నేపథ్యంలో రూపొందిన ఉత్సవమ్ చిత్రకథ.. చక్కని సందేశం ఇమిడి ఉందని చెప్పారు.

జూలైలో విడుదలయ్యేందుకు సిద్ధమౌతోన్న ఉత్సవమ్ ఆడియో కార్యక్రమంలో ఫరాఖాన్, విజయ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
About Writer
SELVI.M