Kalavaramaye Madilo| Audio| Colours Swathy| Kamal Kamaraj | ''కలవరమాయే మదిలో..'' ఆడియో విడుదల
|
ఈ చిత్రం ఆడియో విడుదల లహరి మ్యూజిక్ ద్వారా జరిగింది. ఆదివారం రాత్రి ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో దిల్‌రాజు సీడీని విడుదలచేసి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి ఇచ్చారు. గాయని చిత్ర ఆడియోకేసెట్‌ను విడుదలచేసి దర్శకుడు సముద్రకు అందించారు.
దర్శకుడు మాట్లాడుతూ.. 2002లోనే కథతో మోహన్‌గారిని కలిశాను. ఆయన పరిచయంతో దిల్‌రాజుని కలిశాను. ఆయన చేతి టచ్‌చేస్తే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. అలాగే విష్‌చేశారు. ఆ తర్వాత "హోప్" అనే జాతీయఅవార్డు సినిమాతీశాను. కొంత కాలం గ్యాప్ తీసుకున్నాక మోహన్‌గారు వచ్చి తనకు అవకాశం ఇచ్చారని దర్శకుడు వివరించారు.
ఇందులో స్వాతిది ప్రధాన పాత్ర అని, ఆమె నటన చాలా అద్భుతంగా ఉంటుందని, మరో సావిత్రిలా స్వాతి పేరు తెచ్చుకుంటుందని దర్శకుడు కొనియాడారు.
కథ గురించి చెప్పాలంటే.. టీవీ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనే గాయనీగాయకుల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. చిత్ర చక్కని గాత్రం స్వాతికి సూటయింది. మలయాళంలో పేరుమోసిన శరత్‌వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచిందని దర్శకుడు చెప్పారు. సాహిత్యపరంగా వనమాలి చక్కని ప్రతిభ కనబరిచారని మోహన్ వడ్లపట్ల పేర్కొన్నారు.
హీరో కామరాజ్ మాట్లాడుతూ, మనస్సుకు హత్తుకునేలా చిత్రాన్ని మలిచారు. స్వాతిది అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ అని చెప్పారు. స్వాతి మాట్లాడుతూ, ఒక ఆల్బమ్‌లా చక్కటి చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దారని చెప్పారు.