1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sathya Krishnan

Posani Krishna Murali| Sathya Krishnan| Gali Seenu| Mental Krishna | "గాలిశీను" ఏంచేస్తున్నాడు!

పోసాని కృష్ణమురళి
పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో, సత్యకృష్ణన్‌ (మెంటల్‌ కృష్ణ ఫేమ్‌) మరో పాత్రలో నటిస్తోన్న చిత్రం 'గాలిశీను'. స్వప్నమూవీస్‌ పతాకంపై ఎం.వి. కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా, పి. ఉదయభాస్కర్‌ దర్శకత్వం వహించారు. 

ఇందులో టైటిల్‌రోల్‌ను హనీఫ్‌ అనే నూతన నటుడు పోషిస్తున్నాడు. వీధి రౌడీ నుంచి డాన్‌ స్థాయికి ఎదగాలనుకునే వ్యక్తి కథే "గాలిశీను" అని దర్శకుడు తెలిపారు. వల్గారిటీలేని చక్కటి హాస్యభరిత చిత్రమని ఆయన అన్నారు.

ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, సెన్సార్‌ బోర్డు సిగ్నల్ కోసం వేచి ఉందని దర్శకుడు అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని జులై మొదటివారంలో విడుదలచేస్తున్నామని ఆయన తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ, ఇందులో ఐదు పాటలున్నాయని, ఫైట్స్‌, కామెడీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని చెప్పారు. ఇందులో ముమైత్ ఖాన్ గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత వెల్లడించారు.
About Writer
SELVI.M