Allari Naresh| Bendu Apparao| Kamna Jetmalani| E.V.V.| Rama Naidu | కోనసీమ చుట్టివచ్చిన "బెండు అప్పారావు"
|
ఈ చిత్రం గురించి రామానాయుడు మాట్లాడుతూ.. తాజా షెడ్యూల్ కోనసీమలో చేశామన్నారు. ఇ.వివి స్వస్థలం కోరుమామాడితోపాటు దోసకాయలపల్లి, దొమ్మేరు, తోగుమ్మి, గూటాల, రాజమండ్రి, ధవళేవ్వరం. చుట్టివచ్చామని ఆయన తెలిపారు.
ఇంతకుముందే విదేశాల్లో మూడు పాటలను చిత్రీకరించామని, మంచి వినోదభరితంగా ఈ చిత్రముంటుందని రామానాయుడు వెల్లడించారు. మళ్ళీ జులైలో కోనసమీలో మరో షెడ్యూల్ ఉంటుందని, దీంతో సినిమా షూటింగ్ పూర్తవుతుందని ఆయన అన్నారు.
ఇ.వి.వి ఇ.వి.వి. సత్యనారాయణ రావు మాట్లాడుతూ, నాయుడుకి సూపర్‌హిట్ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆద్యంతం వినోదభరితంగా బెండు అప్పారావు ఉంటాడని చెప్పారు. చిత్రీకరణ సమయంలోనే యూనిట్ కడుపుబ్బ నవ్వేస్తున్నారని చెప్పారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ, ఇందులో గ్రామాలలో వైద్యం చేసే ఆర్.ఎం.పి. డాక్టర్‌గా నటిస్తున్నానని తెలియజేశారు. గ్రామీణ ప్రజల మధ్య సరదాలు, సరసాలు ఎమోషన్స్ అన్నీ తన పాత్రలో ఉన్నాయన్నారు.
కామ్నజెఠ్మలానీ, మేఘన, చలపతిరావు, అలీ, జీవి, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: గిరి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, రచనా సహకారం: వేగేశ్న సతీశ్, సంగీతం: కోటి, కెమెరా: వి. జయరాం.