గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » సావిత్రి- జి.వరలక్ష్మి మధ్య కప్పు-గ్లాసుల తేడా (Actress Savitri | G.Varalakshmi | Coffee | Silverscreen)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
FILE
నాటి వెండితెర లోకంలో పెద్ద హీరోయిన్, చిన్న హీరోయిన్, జూనియర్ ఆర్టిస్టు... వగైరా తేడాలను బట్టి వారివారి హోదాలు పేరుకు మాత్రమే ఉండేవి. అప్పటి తరం అగ్రనాయకానాయికలు అసలు ఈ హోదాలను పట్టించుకునేవారు కాదట. చిన్న చిన్న నటులతో సైతం కలసిమెలసి ఉండేవారట. దీనికి ఉదాహరణగా మహానటి సావిత్రి జీవితంలోని ఓ సంఘటనను చెప్పుకోవచ్చు.

"పెళ్లి చేసి చూడు" చిత్రం షూటింగ్ వాహినీ స్టూడియోలో నిర్మించబడుతున్న సమయంలో సావిత్రి, జి. వరలక్ష్మి ఇద్దరూ కూచుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారట. ఇంతలో ప్రొడక్షన్ బాయ్ క్యాంటీన్ నుంచి కాఫీ తీసుకుని వచ్చి ఇద్దరు నటీమణులకు అందించాడట. అయితే కాఫీ ఇచ్చిన పాత్రల్లో తేడా ఉంది.

జి. వరలక్ష్మికి కప్పు-సాసరులో కాఫీ ఇస్తే... సావిత్రికి గ్లాసులో ఇచ్చాడట. అంటే జి.వరలక్ష్మి ఆ చిత్రంలో కథానాయిక కనుక ఆమె హోదాకు తగ్గట్లు అతను అలా ఇచ్చి ఉంటాడని వేరే చెప్పక్కర్లేదు. అయితే అది చూడగానే జి. వరలక్ష్మి అతనిపై మండిపడి, గ్లాసుతో ఉన్న కాఫీని తిరిగి అతనికి ఇచ్చేసి, మేం ఇద్దరం దీంతోనే తాగుతామని కప్పులోని కాఫీని సావిత్రికి పంచి ఇచ్చిందట.

చిన్నాపెద్దా తేడా ఆనాడు సినీపరిశ్రమలో ఉండేది కాదని ఈ సంఘటన తెలియజేస్తుంది. కానీ నేటి సినీ పరిశ్రమలో ఒక్క సినిమా హిట్ అయితే చాలు అప్పటివరకూ ప్రాణస్నేహితులుగా ఉన్నవారిని సైతం పట్టించుకునే పరిస్థితులు ఉండటం లేదు. ఈ విషయాన్ని పలువురు సీనియర్ నటీనటులే అప్పుడప్పుడు చెపుతుంటారు కూడా. ఏమైనా నాటితరం నిజంగా వెండితరం కదూ.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వెండితెర, జూనియర్ ఆర్టిస్టు, మహానటి సావిత్రి, పెళ్లి చేసి చూడు