1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Mobile

Evarina Epudina| Mobile| AVM| Varun Sandesh| Vimala Raman | "ఎవరైనా ఎప్పుడైనా" ద్వారా మొబైల్‌ మీ సొంతం

ఎవరైనా ఎప్పుడైనా
WD
ప్రతిష్టాత్మక ఎం.వి.ఎం. సంస్థ నిర్మించిన చిత్రం "ఎవరైనా ఎప్పుడైనా". ఇందులో వరుణ్‌సందేశ్‌, విమలారామన్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. మార్తాండ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన, ఈ చిత్రం ఈనెల 26న విడుదలకానుంది.

ఈ సందర్భంగా రేడియోమిర్చిలో యువకులకు ఓ కాంటెస్ట్‌ పెట్టారు. బుధవారం ఆ వివరాలను రేడియోమిర్చి ద్వారా వెల్లడించారు. రేడియోమిర్చి 98.3 ఎఫ్‌.ఎంలో బుధ, గురువారాల్లో రెండురోజులపాటు గంటగంటకూ ప్రేమగురించి అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేవారికి మొబైల్‌ గెలుచుకునే అవకాశం ఉంటుందని దర్శకుడు శంకర్‌ తెలిపారు.

యువత మనోభావాలకు అనుగుణంగా ఈ చిత్రం రూపొందిందన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ, ఇది కేవలం హైదరాబాద్‌ వాసులకే పరిమితమని రేడియోమిర్చి ప్రతినిధి స్వప్న తెలిపారు.
About Writer
SELVI.M