గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » ఆ ప్రమాదం నుంచి దేవుడే రక్షించాడు: భారవి (Bharavi| Annamayya| Rama Doss| Venkanna| Sri Rama)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
అన్నమయ్య, రామదాసు, పాండురంగడు ఇలాంటి పౌరాణిక చిత్రాల కథారచయిత అనగానే గుర్తుకువచ్చేది జె.కె. భారవి. అన్నమయ్య కథను చిత్రంగా మార్చడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం తాను మళ్ళీ ప్రజలముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి శ్రీవెంకటేశ్వరుడు, శ్రీరాముడు వంటి దేవుళ్ళే కారణమని భారవి అన్నారు.

గతనెల 25న నల్గొండ జిల్లాలో భారవి కారులో పయనిస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. అయితే భారవి చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. కారు మాత్రం నుజ్జునుజ్జు అయింది.

ఈ ప్రమాదం గురించి భారవి మాట్లాడుతూ.. వెంటనే అక్కడి ప్రజలు తనను గుర్తుపట్టి, మీరు తీసిన సినిమాల దేవుళ్ళే మిమ్మల్ని రక్షించారని అనడంతో ఒక్కసారిగా చిన్నపిల్లవాడిలా ఏడ్చేశానన్నారు. దేవుని ఆశీస్సులు, ప్రజల అభినందనలు తనను కాపాడాయని ఆయన గద్గదస్వరంతో చెప్పారు.

వెంగమాంబ చిత్రానికి కథను తానే కథను రాయాల్సి ఉంది. కానీ ముక్తేవి భారతి ఆ అవకాశాన్ని కొట్టేసింది. ఎప్పటికైనా మరో పౌరాణిక చిత్రంతో ప్రజల ముందుకు వస్తానని భారవి వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: రోడ్డు ప్రమాదం, దేవుడు, భారవి, అన్నమయ్య, రామదాసు, పాండురంగడు, వెంకన్న, శ్రీరాముడు