గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » తెలుగులో వస్తోన్న "జయంమనది" (Telugu| Jayam Manade| Vinay| Bhavana| vana| Ontari)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
తమిళంలో "జయంకొండాన్"గా తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో "జయంమనది"గా అనువదిస్తున్నారు. తమిళంలో పలు విజయవంతమైన భాషా, వసంతకోకిల, విజేత చిత్రాల మాతృకను నిర్మించిన టి.జి. త్యాగరాజన్, తాజాగా జయం మనది చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.

సత్యజ్యోతి ఫిలింస్‌పై తెలుగులోకి అనువాదమౌతోన్న "జయం మనది" చిత్రంలో వాన ఫేమ్ వినయ్, ఒంటరి ఫేమ్ భావన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఆర్. కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా చిత్ర ఆడియో సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. హైదరాబాదులో జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ముఖ్యఅతిథిగా హాజరైన కోడి రామకృష్ణ ఆడియోను ఆవిష్కరించారు.

ఆడియో విడుదల సందర్భంగా, కోడి రామకృష్ణ మాట్లాడుతూ.. తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన త్యాగరాజన్ తెలుగులో కూడా నిర్మాణ సారథ్యం వహించాలన్నారు. డబ్బింగ్ చిత్రాల్లో "జయం మనది" మంచి హిట్ చిత్రమవుతుందని రామకృష్ణ నమ్మకం వ్యక్తం చేశారు. చిత్రంలోని పాటలు బాగున్నాయని, అద్భుతమైన టేకింగ్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని తెలిపారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. తమిళంలో హిట్ చిత్రమైన జయం కొండాన్ తెలుగు రీమేక్ హక్కులు ఎవ్వరికీ ఇవ్వకుండా వారే అనువదిస్తున్నారు. కథాబలమున్న ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని సురేష్ ఆశించారు. టైటిల్‌కు తగినట్లుగానే ఈ చిత్రముంటుందని హీరో వినయ్ అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: తెలుగు, జయంమనది, వినయ్, భావన, వాన, ఒంటరి, త్యాగరాజన్, భాషా